Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..

|

Apr 17, 2022 | 8:23 PM

Multibagger Stock: పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడి చాలా రిస్క్ తో కూడుకున్నది. కానీ అవి మల్టీ బ్యాగర్లుగా మారితే మాత్రం పెట్టుబడిదారులకు మంచి ఆదాయాన్ని ఇస్తుంటారు.

Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..
Multibagger Stock
Follow us on

Multibagger Stock: పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడి చాలా రిస్క్ తో కూడుకున్నది. కానీ అవి మల్టీ బ్యాగర్లుగా మారితే మాత్రం పెట్టుబడిదారులకు మంచి ఆదాయాన్ని ఇస్తుంటారు. స్టాక్ మార్కెట్లో వేల సంఖ్యలో ఉండే అనేక కంపెనీల నుంచి మల్టీ బ్యాగ్ స్టాక్స్ ను గుర్తించటం కొంత కష్టమైన పనే. కొంత పరిశోధన చేసి మంచి ఆర్థిక పరిస్థితులు, పనితీరు, కంపెనీ లాభాలు, లాభాలను కొనసాగించే కంపెనీలను ఎంచుకునే వారిని మాత్రం అవి లక్షాధికారులను, కొన్ని సార్లు కోటీశ్వరులను కూడా చేసేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ADINATH TEXTILES షేర్ కూడా. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠం రూ.101.70ని తాకగా.. 52 వారాల కనిష్ఠం రూ.2.59గా ఉంది. కేవలం రెండేళ్ల కాలంలో ఈ షేర్ మంచి లాభాలను అందించింది.

రెండు సంవత్సరాల కాలంలో షేరు 9000 శాతం పెరుగుదలను నమోదు చేసింది. రెండేళ్ల కిందట ఈ షేర్ లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి ప్రస్తుతం 90 లక్షలు రాబడి వచ్చి ఉండేది. కంపెనీ క్యాష్ ఫ్లోస్ తగ్గడం వల్ల షేర్ ప్రభావితమవుతోంది. ప్రస్తుతం ఈ షేరు బీఎస్ఈలో రూ.56.35 వద్ద ట్రేడ్ అవుతోంది. అధినాథ్ టెక్స్‌టైల్స్ 1979లో లుథియానాలో స్థాపించారు. ఇది ఆదినాథ్ బ్రాండ్ పేరుతో సింథటిక్, ఉన్ని-మిశ్రమ వస్త్రాలు, అల్లిక నూలులను తయారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ 1979-80లో లుథియానాలో చిన్న-స్థాయి కార్యకలాపాలను ప్రారంభించింది.

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Campus IPO: వచ్చే నెలలో రానున్న క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ.. ఇప్పటికే సెబికి దరఖాస్తు చేసిన కంపెనీ..

Anand Mahindra: బ్రిలియంట్ అంటూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..