Gautam Adani: మరో రెండు కీలక రంగాల్లో అదానీ ఎంట్రీ.. ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో ఢీ అంటే ఢీ..

|

Apr 23, 2022 | 6:21 PM

Gautam Adani: సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు వంటి రంగాలలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్​ ఇప్పుడు డిఫెన్స్ (defence)​, ఏరోస్పేస్ (Aerospace) ​రంగాలలో అడుగు..

Gautam Adani: మరో రెండు కీలక రంగాల్లో అదానీ  ఎంట్రీ.. ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో ఢీ అంటే ఢీ..
Follow us on

Gautam Adani: సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు వంటి రంగాలలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్​ ఇప్పుడు డిఫెన్స్ (defence)​, ఏరోస్పేస్ (Aerospace) ​రంగాలలో అడుగు పెట్టనుంది. అందనంత స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. అదానీ అనేది ఒక పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. దీని వెనక ఎన్నో ఏళ్ల కృషి.. అవకాశాన్ని అందుపుచ్చుకునే నైపుణ్యం ఉంది. ప్రపంచాన్ని పదేళ్లు ముందుగానే చూసే తత్వం ఆయనది. అదే ఇప్పుడు అదానీని అగ్ర స్థానంలో నిలబెట్టింది. ఇప్పటికే సోలార్​ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు లాంటి రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ (Adani Group)​.. ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్​మోడర్నైజేషన్​ కోసం 300 బిలియన్​ డాలర్లను ఖర్చు పెట్టాలనేది కేంద్ర సర్కార్‌ ఆలోచన. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు గౌతమ్‌ అదానీ. అయితే భారత్‌ పర్యటనలో ఉన్న ​బ్రిటన్​ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు కూడా జరిపారు. అదానీ, బ్రిటన్‌ ప్రధాని మధ్య జరిగిన భేటీలో అత్యంత కీలకమైన అంశం రక్షణ రంగంపై చర్చించారు.

భారత్‌ పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధానిని కలిసిన అదానీ..

అయితే భారత్ రెండు రోజుల ఇండియాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​జాన్సన్ అహ్మదాబాద్‌లో గౌతమ్​అదానీని కలిశారు. బ్రిటన్​ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్‌కు తమ గ్రూప్ హెడ్​ క్వార్టర్‌లో ఆతిధ్యం ఇవ్వడం ఆనందం కలిగిస్తోందని అదానీ చెప్పుకొచ్చారు. క్లైమేట్, సస్టెయినబిలిటీ వంటి అంశాలలో తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ప్రత్యేకించి రెన్యువబుల్​ ఎనర్జీ, గ్రీన్​హెచ్​2, న్యూ ఎనర్జీలపై అదానీ గ్రూప్​ దృష్టి పెడుతోందన్నారు. డిఫెన్స్​, ఏరోస్పేస్​ టెక్నాలజీ రంగాలలోనూ యూకే కంపెనీలతో తమ గ్రూప్​ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు.

2019లో ఆరు విమానాశ్రయాలకు కేంద్రం వేలం నిర్వహించగా.. అన్నింటిని అదానీ గ్రూపే దక్కించుకుంది. ముంబై విమానాశ్రయంలోనూ 76శాతం వాటా అదానీ గ్రూప్ సొంతం. మార్కెట్‌ అప్ అండ్ డౌన్స్ ప్రభావం పెద్దగా కనిపించని రంగాల పైనే అదానీ ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI ATM: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!

India Post: ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలా చేసినట్లయితే బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!