Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..

|

Apr 16, 2022 | 10:28 AM

Rakesh Jhunjhunwala: మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా తన భార్య రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో(Portfolio) నిర్మాణ, ఇంజనీరింగ్ కంపెనీలో వాటాలను భారీగా పెంచుకున్నారు.

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..
Rakesh Jhunjhunwala
Follow us on

Rakesh Jhunjhunwala: మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా తన భార్య రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో(Portfolio) నిర్మాణ, ఇంజనీరింగ్ కంపెనీలో వాటాలను భారీగా పెంచుకున్నారు. కొత్తగా.. దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజ కంపెనీ NCC లిమిటెడ్‌లో వాటాలు కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో వీరు ఈ సంస్థలో కొత్తగా 44 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఈ కంపెనీలో రాకేశ్‌, ఆయన భార్యకు కలిపి 2021 డిసెంబరు ఆఖరుకు ఉన్న 12.84 శాతం వాటా.. 13.56 శాతానికి పెరిగింది. కరోనా(Corona) తరువాత నిర్మాణ రంగం ఊపందుకోవటంతో భారీగా ప్రాజెక్టులు లభించే అవకాశం ఉండటంతో ఈ రంగానికి చెందిన కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే సిమెంట్ కంపెనీల షేర్లకు సైతం డిమాండ్ భారీగానే పెరుగుతోంది. మరో పక్క కారణం లేకుండా బిగ్ బుల్ పెట్టుబడి నిర్ణయాలు ఉండవని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

NCCలో అనేక సంవత్సరాలుగా రాకేష్ జున్‌జున్‌వాలా ఇన్వెస్టర్ గా కొనసాగుతున్నారు. గతేడాది డిసెంబరు నెలాఖరుకు ఈ కంపెనీలో ఆయన పేరు మీద 6.67 కోట్లకు పైగా షేర్లు, ఆయన భార్య పేరు మీద 1.16 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రాకేశ్‌ తన వాటాలను స్థిరంగానే కొనసాగిస్తుండగా.. ఆయన భార్య కొత్తగా మరో 44 లక్షల షేర్లను కంపెనీలో కొనుగోలు చేశారు. దీంతో ఆమె వాటాలు 1.60 కోట్లకు చేరుకున్నాయి. ఎన్‌సీసీలో పలు మ్యూచువల్‌ ఫండ్స్, కొన్ని దేశీయ, విదేశీ సంస్థలు వాటాలు కలిగి ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌, నిప్పన్‌ లైఫ్‌ పవర్‌ & ఇన్‌ఫ్రా ఫండ్‌, ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్‌ వాల్యూ ఫండ్‌ ఉన్నాయి. విదేశీ సంస్థ వాన్‌గార్డ్‌ ఎమెర్జింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌, దేశీయ ఇన్సూరెన్స్ కంపెనీ.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఈ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఎన్‌సీసీ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.98.45 కాగా, కనిష్ఠ ధర రూ.55.80గా ఉంది.

ప్రస్తుతం మార్కెట్లు FY22 నాల్గవ త్రైమాసిక ఆదాయాల ద్వారా ప్రభావితమవుతాయి.  NCC షేర్లలో మెుమెంటమ్ ట్రెండ్‌ను అనుసరించే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజీలలో లిస్టయిన షేర్ల కోసం Q4 ఆదాయాలు ప్రధాన దశకు చేరుకున్నాయి. NCC కూడా మార్చి 2022తో ముగిసే నాల్గవ త్రైమాసికంలో దాని ఆర్థిక పనితీరుపై దృష్టి సారిస్తుంది. NCC మంచి Q4 త్రైమాసికాన్ని నమోదు చేయవచ్చని తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Srilanka Crisis: భారత కంపెనీలకు లంకంత కష్టం.. తలకిందులైన పరిస్థితులు.. ఎందుకంటే..

Petrol Diesel Price Today: దేశంలో ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!