Adani Group: అదానీ కంపెనీల్లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడి.. ఇన్వెస్ట్‌మెంట్ డీల్ విలువ ఎంతంటే..

|

Apr 08, 2022 | 8:54 PM

Adani Group: అదానీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం పెట్టుబడిదారులకు ప్రధమ ఎంపికగా మారిపోయాయి. 2022లో అదానీ గ్రూప్‌ కంపెనీలు అద్భుతంగా పనిచేయటం కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.

Adani Group: అదానీ కంపెనీల్లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడి.. ఇన్వెస్ట్‌మెంట్ డీల్ విలువ ఎంతంటే..
Adani
Follow us on

Adani Group: అదానీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం పెట్టుబడిదారులకు ప్రధమ ఎంపికగా మారిపోయాయి. 2022లో అదానీ గ్రూప్‌ కంపెనీలు అద్భుతంగా పనిచేయటం కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది. అబుదాబికి చెందిన పెట్టుబడి సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీల్లో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అంటే 15 వేల కోట్ల రూపాయల నిధులను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(Adani Green) , అదానీ ట్రాన్స్‌మిషన్(Adani Transmission), అదానీ ఎంటర్‌ప్రైజెస్(Adani Enterprises) కంపెనీలో ఈ మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు నిర్ణయించింది. ఈ సమాచారాన్ని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వెల్లడించింది. మూడు గ్రూపు కంపెనీల బోర్డు ఈ పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు కంపెనీ వాటాదారులు, రెగ్యులేటర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతే కాకుండా సెబీ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.

ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో రూ.3850 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో రూ.3850 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగిలిన రూ.7700 కోట్లను అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో పెట్టుబడిగా పెట్టనుంది. అదానీ గ్రూప్, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ స్థిరమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ మరియు ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉన్నాయని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. రెండు కంపెనీల మధ్య కొత్త సంబంధం మొదలైందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారతదేశానికి పెట్టుబడులు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నెలాఖరులోగా దీనికి అవసరమైన అన్ని అనుమతులను తీసుకోనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఈ నెలాఖరులోగా లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉందని.. ఈ మూడు కంపెనీలు తమ వృద్ధికి ఈ నిధులను ఉపయోగిస్తాయని తెలుస్తోంది. ఇది కాకుండా కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్, ఇతర కార్పొరేట్ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఈ మెుత్తాన్ని ఉపయోగించనున్నాయి. ఇది భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అని ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ బసర్ సుహెబ్ తెలిపారు. భారతదేశం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మేము ఇందులో పాలుపంచుకోవాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Shares: షేర్ల డీలిస్టింగ్ నుంచి పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండటం ఎలా.. పూర్తి వివరాలు..

Srilanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. ఏప్రిల్ తరువాత పెనం మీద నుంచి పొయ్యిలోకి..