Electric Vehicles: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే 12 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలు ఊపందుకోనున్నాయి. మనదేశంతో సహా వివిధ దేశాల్లోని వాహనాల వినియోగదారుల్లో 90 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడానికి ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్ (ఈవై) అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే ఈవై సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది.. ఎలక్ట్రిక్ వాహన ధరలో 20 శాతం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చారు. ఇండియాలో ఒకసారి చార్జింగ్ చేసిన ఎలక్ట్రిక్ వాహనం 100-200 మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండాలని కోరారు. సుమారు 90 శాతం మంది ఇండియన్లు ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేయడానికి ప్రీమియం చెల్లించడానికి సిద్ధం అని పేర్కొన్నారు. వారిలో 40 శాతం మంది సదరు ప్రీమియం 20 శాతం వరకైనా చెల్లించేందుకు రెడీ అని సంకేతాలిచ్చారు.
కాగా, ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడల్ కార్ల కంటే డిజిటల్ చానెల్స్ ఉన్న కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 97 శాతం మందిలో పర్యావరణం పట్ల అవగాహన పెరిగింది.
67 శాతం మంది ఒక విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేసి తమ వంతుగా వ్యక్తిగతంగా పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారు. 69 శాతం మంది ఈ లక్ష్య సాధనకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడం ఒక్కటే మార్గం అని సర్వేలో స్పష్టం అయ్యింది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనం కలిగి ఉన్న వారు.. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే వాహనాలు గంటలోపే పూర్తిగా చార్జింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలని అభిప్రాయ పడుతున్నారు. 45 శాతం మంది కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.