భారతదేశంలో వివిధ ప్రయోజనాల కోసం అనేక విభిన్న పత్రాలు జారీ చేస్తుంటారు. వీటిలో చాలా పత్రాలు గుర్తింపు కార్డులుగా ఉపయోగిస్తుంటారు. గుర్తింపు పత్రాల్లో అతి ముఖ్యమైనది ఆధార్. ప్రస్తుతం ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. అనేక ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తుంటాము. భారతదేశ జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డు ఉంది. ప్రతిరోజూ ఏదో ఒక పనికి ఆధార్ కార్డు కావాలి. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవావాలన్నా మీ ఆధార్ కార్డును రుజువుగా అందించాలి.
చాలా సార్లు ప్రజలు ఆధార్ కార్డులో తప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంటారు. పొరపాట్లను సరి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు UIDAI ద్వారా ఉన్నాయి. మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
ఇదిలా ఉంటే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. అలాగే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి పరిమితి లేదు. ఎన్ని సార్లైనా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే మీరు మీ ఆధార్ కార్డ్‌లోని మీ నంబర్‌ను మీకు కావలసినన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం ప్రతిసారి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి చూద్దాం.
ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి అప్‌డేట్ ఫారమ్ తీసుకోవాలి. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఫారమ్‌ను టిక్ చేయాలి. ఆ తర్వాత మీరు కొత్త మొబైల్ నంబర్ సమాచారాన్ని నమోదు చేయాలి. ఇందు కోసం కొంత రుసుము చెల్లించాలి. దీని తర్వాత నంబర్ అప్‌డేట్ అవుతుంది.
ఇది కూడా చదవండి: UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి