మహిళా సాధికారతకు ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. వారి స్వావలంబనకు, స్వయం ఉపాధికి కూడా పలు పథకాలను ప్రవేశపెడుతుంటాయి. అలాంటి పథకాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో ప్రభుత్వం ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెల అర్హులైన మహిళలు ఒక్కొక్కరికీ రూ. 1500 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ఆ రాష్ట్ర మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ పథకానికి దరఖాస్తు కాలపరిమితిని ఒక నెల పొడిగించారు. రక్షాబంధన్‌కు ముందు లడ్కీ బహిన్ యోజన కింద లక్షలాది మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో మొదటి రెండు నెలలకు సంబంధించి రూ. 3000 జమ చేశారు. ఇదిలావుండగా, మహిళల కోసం ప్రారంభించిన ఈ పథకంలో ఓ పెద్ద మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది. లడకీ బహిన్ యోజన కోసం ఓ వ్యక్తి తన భార్య పేరు మీద 30 దరఖాస్తులను సమర్పించాడు. దానిలో 27 దరఖాస్తులు అప్రూవ్ అవడం, ఆ 26 దరఖాస్తులకు గానూ రూ. 3000 చొప్పున రూ. 78వేలు అకౌంట్లో జమవడం జరిగిపోయాయి. ఈ విషయంపై పన్వేల్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది.
మహిళలకు సంబంధించిన ఈ పథకం నుంచి లబ్ధి పొందడానికి ఓ వ్యక్తి తన భార్య పేరుతో పాటు అనేక పేర్లతో, వివిధ మహిళలల రూపాలలో, విభిన్న దుస్తులతో అనేక ఫొటోలతో దరఖాస్తు చేశాడు. పంజాబీ సూట్‌లు, పోలోకాలు, చీరలు, రకరకాల హెయిర్‌స్టైల్‌లను డిజైన్ చేస్తూ వివిధ కోణాల్లో తన చిత్రాలను తీసుకొని మొత్తం 30దరఖాస్తులు చేశాడు. వాటిల్లో అతను 27 రకాల దుస్తులలో చిత్రాలు తీశాడు. ఈ ఫోటోలన్నింటికి వేర్వేరు మహిళల ఆధార్ కార్డులను జతచేసి, దానికి ఒకే మొబైల్ నంబర్‌ను లింక్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతని దరఖాస్తుల్లో 26 ఆమోదం పొందాయి. వీటికి సంబంధించిన మొత్తం కూడా అతని సహకార బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సమాచారం.
ఈ మోసంపై విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అందులో ప్రధానంగా ఒకే ఫోన్ నంబర్‌పై 30 మంది లబ్ధిదారుల దరఖాస్తులున్నట్లు గుర్తించారు. అలాగే వారి ఆధార్ కార్డులు కూడా ఒకే నంబర్ పై లింక్ అయినట్లు తేల్చారు. ఓటీపీ కోసం ప్రయత్నించినప్పుడు ఒకే నంబర్ కు ఇది ఓటీపీలు పంపినట్లు గుర్తించారు.
నవీ ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన పూజా మహాముని (వయస్సు 27) లడ్కీ బహిన్ యోజన కోసం తన దరఖాస్తును సమర్పించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ ఆమె దరఖాస్తు ఆన్ లైన్ ప్లాట్ ఫారం తీసుకోలేదు. అయితే ఆగస్టు 15 తర్వాత, అర్హత ఉన్న అనేక నెలల బ్యాంకు ఖాతాలో పథకానికి సంబంధించిన మొత్తం జమ అయ్యింది. ఈ క్రమంలో అధికారి పూజా మహాముని పేరుతో డబ్బులు పడ్డాయని చెప్పారు. అయితే ఆమె అసలు తాను దరఖాస్తు చేయలేదని, డబ్బు కూడా తన ఖాతాలో జమ కాలేదని అధికారులకు వివరించారు. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమె పేరుతో ఉన్న దరఖాస్తును శోధించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూజ మహాముని ఆధార్ కార్డు సతారాకు చెందిన జాదవ్ అనే వ్యక్తి మొబైల్ నంబర్‌కు లింక్ అయినట్లు గుర్తించారు. ఈ వ్యక్తి దాదాపు 30 దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో తేలింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..