Senior citizens: సీనియర్ సిటిజన్స్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు.. 8.5% ఆఫర్ చేస్తోన్న ప్రభుత్వ కంపెనీ..

|

Aug 06, 2022 | 10:30 AM

అధిక ద్రవ్యోల్పణం, స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు మధ్య ఫిక్స్ డ్ డిపాజిట్లు అయితే తమ డబ్బుకు ఢోకా ఉండబోదని ఈవైపు అడుగులు వేస్తారు చాలామంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల రేపో రేటును పెంచడంతో ఫిక్స్ డ్ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.

Senior citizens: సీనియర్ సిటిజన్స్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు.. 8.5% ఆఫర్ చేస్తోన్న ప్రభుత్వ కంపెనీ..
Fixed Deposits(File Photo)
Follow us on

Senior citizens FD Interest Rate: వృద్ధులు తమ స్వల్పకాలిక అవసరాల కోసం పొదుపు చేసుకోవడానికి ఫిక్స్ డ్ డిపాజిట్లను సరైన ఎంపికగా భావిస్తారు. అది కూడా ప్రభుత్వ గ్యారంటీ, రక్షణ ఉన్న సంస్థలైతే బెటరనుకుంటూ ఉంటారు. అధిక ద్రవ్యోల్పణం, స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు మధ్య ఫిక్స్ డ్ డిపాజిట్లు అయితే తమ డబ్బుకు ఢోకా ఉండబోదని ఈవైపు అడుగులు వేస్తారు చాలామంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల రేపో రేటును పెంచడంతో ఫిక్స్ డ్ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పటివరకు అత్యధికంగా బ్యాంకింగ్ రంగంలో 7.10% వడ్డీ రేటును మాత్రమే వృద్ధుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇస్తుండగా.. తమిళనాడులోని ఓ ప్రభుత్వ సంస్థ తమ వద్ద ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి 8.5% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అందిస్తోంది. దీనిలో భాగంగా సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే వారి అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ఫిక్స్ డ్ డిపాజిట్లను తమిళనాడుకు చెందిన ఈప్రభుత్వ కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి క్యుములేటివ్ ఫిక్స్ డ్ డిపాజిట్ కాగా మరొకటి నాన్ క్యుములేటివ్ ఫిక్స్ డ్ డిపాజిట్.

క్యుములేటివ్ ఫిక్స్ డ్ డిపాజిట్: దీనిలో ఫిక్స్ డ్ డిపాజిట్ల కాలపరిమితి 1, 2, 3, 4, 5 సంవత్సరాలుగా ఉంది. పెట్టుబడి దారుడు ఎంచుకున్న కాల వ్యవధి ప్రకారం వడ్డీ రేటును కనిష్టంగా 7.25% నుంచి గరిష్టంగా 8.5% చెల్లిస్తారు. 58 సంవత్సరాలు లేదా అంతకు ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఐదు సంవత్సరాల కాలానికి చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 8.5% వడ్డీరేటు చెల్లిస్తారు. మూడునెలలకొసారి వడ్డీ రేటును జమచేస్తారు.

నాన్ క్యూములేటివ్ ఫిక్స్ డ్ డిపాజిట్: ఇందులో పెట్టుబడిదారులు తమ డిపాజిట్లుపై నెలవారీ, త్రైమాసిక, వార్షిక వడ్డీని పొందవచ్చు. ఫిక్స్ డ్ డిపాజిట్ కాలవ్యవధి పూర్తైతే తమ పెట్టుబడిని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ కాలపరిమితి 2, 3, 4, 5 సంవత్సరాలుగా ఉంది. సీనియర్ సిటిజన్లు కానివారికి 7.25% నుంచి 8% మధ్య వడ్డీ రేటు లభిస్తుంది. వృద్ధులకు అయితే 8.5 శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా వడ్డీరేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చు. అందుకే ఎవరైనా ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసేటప్పుడు ఆసమయంలో బ్యాంకు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి