
నేటి పెట్టుబడే భవిష్యత్‌లో మంచి రాబడికి మార్గమని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తూ ఉంటారు. భారతదేశంలో మెరుగైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిలుస్తున్నాయి. ముఖ్యంగా నమ్మకమైన రాబడిని అందించేందుకు ఎఫ్‌డీలు మంచి ఎంపికగా ఇటీవల కాలంలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి అనేది బ్యాంకులు అందించే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. అలాగే వడ్డీ కూడా బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పదవీ కాలం ఆధారంగా ఎఫ్‌డీ వడ్డీ అనేది హెచ్చుతగ్గులకు గురవతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలంలో మీ సొమ్మును ఎఫ్‌డీల్లో ఏయే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అనే విషయాలను గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంకులో ఐదేళ్ల ఎఫ్‌డీలపై 6.5 శాతం అందిస్తుంది. అయితే తక్కువ కాల వ్యవధికి అంటే ఒక సంవత్సరం — వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఐదేళ్ల ఎఫ్‌డిపై 7 శాతం అందిస్తుంది. అయితే స్వల్ప కాల వ్యవధి డిపాజిట్ అంటే ఒక సంవత్సరానికి 6.7 శాతం వడ్డీని ఇస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి.
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే స్వల్ప కాల వ్యవధి ఎఫ్‌డీ అంటే ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
రాష్ట్ర రుణదాత ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.50 శాతం అందిస్తుంది. అయితే ఒక సంవత్సరం ఎఫ్‌డీ సంవత్సరానికి 6.85 శాతం అందిస్తుంది. ఈ రేట్లు జనవరి 15, 2024 నుండి అమల్లోకి వచ్చాయి.
ఈ బ్యాంక్ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.20 శాతం అందిస్తుంది. అయితే ఒక సంవత్సరం ఎఫ్‌డీ 7.10 శాతం అందిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 27, 2024 నుండి అమల్లోకి వచ్చాయి.
రాష్ట్ర రుణదాత తన ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.55 శాతం ఇస్తుంది. స్వల్ప కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే ఒక సంవత్సరానికి 6.8 శాతం వడ్డీని ఇస్తాయి. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 12, 2024 నుండి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..