దీపావళికి గోల్డ్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..! అతి తక్కువ ధరకు బంగారం కొనండి..

గత కొన్ని వారాలుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా, భారతదేశంపై అమెరికా అధిక సుంకాలు విధించడంతో బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీని కారణంగా వినియోగదారులు బంగారం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్‌ సర్కార్‌ గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ అందిస్తోంది. వచ్చే దీపావళికి మీరు కొరుకున్న బంగారం కొనుగోలు చేసే అవకాశం రానుంది. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

దీపావళికి గోల్డ్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..! అతి తక్కువ ధరకు బంగారం కొనండి..
9 Carat Gold

Updated on: Sep 01, 2025 | 12:40 PM

Today Gold rate: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. అయితే, జూన్‌లో భారతదేశ బంగారం అమ్మకాల్లో 60శాతం తగ్గుదల కనిపించింది. అందువల్ల, ప్రజలు బంగారం కొనుగోలు చేయమని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గత నెలలో 9 క్యారెట్ల బంగారాన్ని హాల్‌మార్క్ ప్రమాణాలలో చేర్చాలని ఆమోదించి ఆదేశించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్కింగ్ వ్యవస్థ 9 క్యారెట్ల బంగారాన్ని కూడా చేర్చింది. అసలు ఈ 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి..? దాని ప్రయోజనాలు ఏమిటి..? దాని ధర ఎంత?

ఆగస్టు 2025 నుండి 14K, 18K, 20K, 22K, 23K, 24K మొదలైన వాటితో సహా హాల్‌మార్క్ ప్యూరిటీలకు 9K అధికారికంగా జోడించబడింది. చాలా మంది సాధారణంగా పెట్టుబడి పెట్టే 24K స్వచ్ఛమైన బంగారానికి, ఇప్పుడు చేర్చబడిన 9 క్యారెట్ల బంగారానికి మధ్య తేడా ఏంటంటే..

9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? : 24 క్యారెట్ల బంగారం 99.9శాతం స్వచ్ఛమైన బంగారం, అంటే దానిలో ఇతర లోహాలు లేవు. 9 క్యారెట్ల బంగారం కేవలం 37.5శాతం స్వచ్ఛమైన బంగారం. అంటే మొత్తం 24 భాగాలలో 9శాతం మాత్రమే బంగారం. మిగిలిన 62.5శాతం రాగి, వెండి, జింక్ వంటి మిశ్రమ లోహాలతో తయారు చేయబడింది.

ఇవి కూడా చదవండి

9 క్యారెట్ల బంగారం ధర: ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు దాదాపు రూ.10,000 ఉంది. అంటే, 10 గ్రాములు లక్ష రూపాయలకు అమ్ముడవుతున్నాయి. అదే సమయంలో 9 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.3,700. 10 గ్రాముల ధర రూ.37,000. దీపావళితో సహా పండుగలు వస్తున్నందున భారత ప్రభుత్వం సరైన సమయంలో 9 క్యారెట్ల బంగారాన్ని ఆమోదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి