7th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించనుందా..? కీలక నిర్ణయం తీసుకునే దిశగా..

ఈ ఏడాది జూలైలో కేంద్ర ఉద్యోగులు మరో శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గత రెండు సార్లు డీఎను నిరంతరం 4 శాతం పెంచుతున్నందున, డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. తొలిసారిగా..

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించనుందా..? కీలక నిర్ణయం తీసుకునే దిశగా..
7th Pay Commission

Updated on: Apr 10, 2023 | 6:37 PM

ఈ ఏడాది జూలైలో కేంద్ర ఉద్యోగులు మరో శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గత రెండు సార్లు డీఎను నిరంతరం 4 శాతం పెంచుతున్నందున, డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. తొలిసారిగా 4 శాతం పెంచి 34 శాతానికి చేరుకుంది. దీని తరువాత, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దానిని మళ్లీ 4 శాతం పెంచింది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి పెరిగింది.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. గత నాలుగు నెలల ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో కేంద్ర క్యాబినెట్ మరోసారి కరువు భత్యం, డియర్‌నెస్ రిలీఫ్‌లను 4 శాతం పెంచవచ్చు. అయితే, ఏఐసీపీఐ కొత్త గణాంకాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచుతుందా లేదా 4 శాతం పెంచుతుందా ? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు డియర్‌నెస్ అలవెన్స్ లెక్కింపు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్నేళ్లలో పే కమిషన్‌ను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను లెక్కించేందుకు కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు. ఏడో వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు 2.57 రెట్లు ఇస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 నుంచి 3.68 రెట్లు పెంచవచ్చు.

ఇవి కూడా చదవండి

డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎన్ని రెట్లు పెంచారు..?

కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను స్తంభింపజేశారు. కోవిడ్ తర్వాత దీన్ని ప్రారంభించినప్పటికీ, ఏకకాలంలో 11 శాతం డీఏ పెంచారు. జూలై 2021లో ఇంత భారీ పెరుగుదల కారణంగా కరువు భత్యం 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. దీని తరువాత, అక్టోబర్ 2021లో DA మళ్లీ 3 శాతం పెరిగింది. దాని కారణంగా అది 31 శాతానికి చేరుకుంది. దీని తర్వాత, 4 శాతం, ఆపై ఇటీవల 4 శాతం పెరగడంతో కరువు భత్యం 42 శాతానికి చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి