దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ(Currency), నోట్లకు సంబంధించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా(Socail Media)లో రూ. 500 నోటుకు సంబంధించిన ఓ ఫేక్ వార్త చక్కర్లు కొడుతోంది. రెండు 500 రూపాయల నోట్లకు తేడాను చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఆ నోటు నకిలీదో లేక ఒరిజినల్‌దో ఇలా తెలుసుకోవాలని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB) ట్విట్టర్‌లో తెలిపింది.నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “RBI ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది.
ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష‍్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్‌బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది.మీరు PIB ద్వారా వాస్తవ తనిఖీ చేయవచ్చని పేర్కొంది. దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ని సందర్శించాలని కోరింది. ఇది కాకుండా, మీరు వీడియోను WhatsApp నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.comకు కూడా పంపవచ్చని తెలిపింది.
एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck
➡️यह दावा #फ़र्ज़ी है।
➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।?https://t.co/DuRgmRJxiN pic.twitter.com/AEGQfCM8kZ
— PIB Fact Check (@PIBFactCheck) May 11, 2022
Read also..LIC IPO: నేడే ఎల్‌ఐసీ షేర్ల కేటాయింపు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?