AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: ఇంటి నుంచి చేసే 5 ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాలు.. ఈ ట్రిక్ తెలిస్తే డబ్బుల వర్షమే..

మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెద్దపెద్ద పెట్టుబడులు, సంక్లిష్టమైన ప్రణాళికలు లేకుండానే ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించే మార్గాల కోసం చూస్తున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. డిజిటల్ ప్రపంచం తెచ్చిపెట్టిన అద్భుత అవకాశాలను అందిపుచ్చుకొని, ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా సులభంగా ఆదాయం పొందగల 5 ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం మీ స్మార్ట్‌ఫోన్‌తో, కొద్దిపాటి సమయంతో మీరు ఎలా విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.

Work From Home: ఇంటి నుంచి చేసే 5 ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాలు.. ఈ ట్రిక్ తెలిస్తే డబ్బుల వర్షమే..
Work From Home Business Ideas To Make Money
Bhavani
|

Updated on: May 23, 2025 | 5:45 PM

Share

ఈ రోజుల్లో కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది కూడా సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ, అందరికీ వాటి గురించి పూర్తి అవగాహన ఉండదు. ప్రత్యేక డిగ్రీలు, విశేష నైపుణ్యాలు లేదా సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే ఇంట్లో కూర్చొని డబ్బు ఎలా సంపాదించాలో చూద్దాం. దీనికి కావాల్సిందల్లా ఒక స్మార్ట్‌ఫోన్, కొద్దిగా సమయం మాత్రమే.

1. ఆన్‌లైన్ దరఖాస్తులకు సహాయం చేయండి

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలామంది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి వాటికి లేదా ప్రభుత్వ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నగరాలకు వెళుతుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగినప్పటికీ, ఈ రకమైన దరఖాస్తులను నింపడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారికి మీరు సహాయం చేసి ఆదాయం సంపాదించవచ్చు. కేవలం ఒక ల్యాప్‌టాప్ లేదా మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు. ప్రతి దరఖాస్తుకు రూ. 50 నుండి రూ. 100 వరకు సులభంగా సంపాదించవచ్చు. ఈ సేవలకు నిరంతరం డిమాండ్ ఉంటుంది.

2. డెలివరీ సేవలు

ప్రతి ఊరికి ప్రత్యేకంగా డెలివరీ సేవలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. అలాంటి సంస్థలతో కలిసి మీరు పాలు, నిత్యావసర సరుకులు, ఆహారం వంటి రోజువారీ అవసరమైన వస్తువులకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకొని డెలివరీ చేయవచ్చు. ఒక్కో ఆర్డర్‌కు రూ. 10 నుండి రూ. 50 వరకు సంపాదించవచ్చు. దీనికి ఎటువంటి పెట్టుబడి లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. ఇది కూడా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలలో ఒకటి.

3. ట్రెండింగ్ వార్తలపై షార్ట్ వీడియోలు

ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ట్రెండింగ్ వార్తలపై 30 సెకన్ల నిడివి గల వీడియోలను రూపొందించి పంచుకోవచ్చు. దీని కోసం క్యాన్వా వంటి ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు. మీ ముఖాన్ని చూపించకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి వాయిస్ ఓవర్ ఇవ్వవచ్చు. ఈ వీడియోలను యూట్యూబ్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తూ రావాలి. మీ వీడియోలకు వీక్షకులు పెరిగే కొద్దీ మంచి ఆదాయం వస్తుంది. క్రమం తప్పకుండా పోస్ట్‌లు పెడితే మీ ఆదాయం మరింత పెరుగుతుంది.

4. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో రీసెల్లింగ్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రేతగా నమోదు చేసుకొని వస్తువులను కొనుగోలు చేసి తిరిగి విక్రయించవచ్చు. దీని ద్వారా ప్రతి ఆర్డర్‌కు మీరు కమీషన్ పొందుతారు.

5. ఫ్రీలాన్సింగ్

ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇంట్లో నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చు. మీరు చేసే పనిని బట్టి ఆదాయం ఉంటుంది. రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డేటా ఎంట్రీ వంటి అనేక రకాల పనులు ఫ్రీలాన్సింగ్ ద్వారా లభిస్తాయి.