2,000 notes withdrawal: ఈ బ్యాంకుల్లో ఎలాంటి ఐడీ ప్రూఫ్స్ లేకుండా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు.. వివరాలివే..

|

May 25, 2023 | 2:17 PM

రూ. 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ నెల వరకు గడువు కూడా ఇచ్చింది. అయితే, నోట్లు మార్చుకునే విధానం.. ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. నోట్లు మార్చుకోవాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఐడీ ప్రూఫ్స్, అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

2,000 notes withdrawal: ఈ బ్యాంకుల్లో ఎలాంటి ఐడీ ప్రూఫ్స్ లేకుండా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు.. వివరాలివే..
Rs 2000 Notes
Follow us on

రూ. 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ నెల వరకు గడువు కూడా ఇచ్చింది. అయితే, నోట్లు మార్చుకునే విధానం.. ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. నోట్లు మార్చుకోవాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఐడీ ప్రూఫ్స్, అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ నిబంధనను తప్పనిసరి చేశాయి కూడా. కానీ, ఆర్బీఐ డైరెక్షన్స్ ప్రకారం.. కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను సడలించాయి. ఆ బ్యాంకుల్లో ఎలాంటి ధృవీకరణ లేకుండా, ఐడీ ప్రూఫ్స్ సమాచారం ఇవ్వకుండానే 2000 నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాయి. మరి ఆ బ్యాంకులు ఏవి? ఎలాంటి వెసులుబాటు కల్పించాయి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎస్‌బిఐ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన ఖాతాదారులను ఎలాంటి ఫారమ్‌ను అవసరం లేకుండానే 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. అలాగే, సంబంధిత బ్రాంచిలోనే కాకుండా.. ఏ బ్రాంచ్ వారైనా, ఎక్కడైనా మార్చుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం వారు ఎలాంటి దృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ దగ్గరలోని బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా 2000 నోట్లను మార్చుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు నోట్ల మార్పిడి ప్రక్రియ కొనసాగుతుంది. వ్యక్తులకు 4 నెలల సమయం ఉంది, ప్రతి ఒక్కరూ తమ నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.

PNBతో సహా ఈ బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవచ్చు..

SBI కాకుండా, మరికొన్ని బ్యాంకులు కూడా ID కార్డ్, ఎలాంటి దరఖాస్తు లేకుండానే పెద్ద నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా 2000 నోట్లను మార్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్‌లో ఖాతా లేని వారికి, ఖాతాదారులకు ఫారమ్, ఐడీ కార్డ్ లేకుండా నోట్లను మార్చుకునే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

రూ. 20,000 రూపాయలు ఒకేసారి మార్చుకోవచ్చు..

అయితే నోట్ల మార్పిడికి ఎలాంటి ఫారం, ఐడీ అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. కానీ బ్యాంకులు తమ సౌలభ్యం ప్రకారం స్వంత నిబంధనలను నిర్ణయించుకోవచ్చని సూచించింది. ఇక ఒక వ్యక్తి ఒక రోజులో పది 2000 రూపాయల నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..