Business Ideas: ప్రతీ నెలా రూ.15 వేల పొదుపుతో వ్యాపారం ప్రారంభం.. ఈ మహిళ చేసిన పనికి అందరూ ఫిదా

కరోనా మహమ్మారి తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై దృష్టి మరింత పెరిగింది. దీంతో ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్లడం ఎక్కువైంది. దీంతో కొత్త కొత్త జిమ్ సెంటర్లు వీధివీధిన వెలుస్తున్నాయి. ఇక మహిళల కోసం ప్రత్యేక జిమ్ సెంటర్లు చాలా తక్కువగా ఉన్నాయి.

Business Ideas: ప్రతీ నెలా రూ.15 వేల పొదుపుతో వ్యాపారం ప్రారంభం.. ఈ మహిళ చేసిన పనికి అందరూ ఫిదా
Prathibha Sharma

Updated on: Jan 18, 2026 | 8:15 AM

మహిళల కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ సెంటర్లు ఉండాలనే ఉద్దేశంతో ముంబైకి చెందిన ప్రతిభా శర్మ ముందడుగు వేసింది. జిమ్, ఫిట్‌నెస్ సెంటర్ల యజమానులు గృహిణులు, తల్లులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించి వారి కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఒక్క ఆలోచన ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా పొదుపు మంత్రాన్ని పాటించి తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుంది. ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ.. తనను తాను నమ్ముకుని చివరి అనుకున్నది సాధించింది ప్రతిభా శర్మ. వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ఆమె ఓ మార్గదర్శిగా చెప్పవచ్చు. ఆమె జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం.

మహిళల కోసం ప్రత్యేక ఫిట్‌నెస్ సెంటర్లు

ప్రస్తుతం మహిళల కోసం ప్రత్యేక జిమ్‌లు ఉన్నప్పటికీ.. మహిళల అవసరాలకు అనుగుణంగా అవి లేవని ప్రతిభా శర్మ గుర్తించింది. గృహిణులు, కొత్త తల్లుల ఫిట్‌నెస్ అవసరాలు భిన్నంగా ఉంటాయి. దీంతో ఆ అంతరాన్ని ఓ అవకాశంగా ప్రతిభా శర్మ మార్చుకున్నారు. మహిళల దినచర్యకు అనుగుణంగా ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావించిన ఆమె.. ఈ ఆలోచననే వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు.

ఇంటి ఖర్చుల డబ్బులు ఆదా

ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటు కోసం తగినంత ఆర్ధిక స్తోమత లేకపోవడంతో రుణం కోసం బ్యాంకులను ఆశ్రయించింది ప్రతిభా శర్మ. కానీ ఏ బ్యాంక్ లోన్ మంజూరు చేయలేదు. అనుభవం లేకపోవడం, పూచీకత్తు అందించకపోవడంతో ఏ బ్యాంక్ వ్యాపారం కోసం లోన్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ఇంటి ఖర్చులకు అవసరమయ్యే డబ్బులను నెలనెలా రూ.15 వేలు పొదుపు చేసుకున్నారు. దాదాపు 18 నెలల పాటు అలా ఆదా చేసుకున్న తర్వాత వచ్చిన నిధులతో ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు.

2017లో వ్యాపారం ప్రారంభం

జనవరి 9,2017లో ప్రతిభా శర్మ 11.11 స్లిమ్మింగ్, ఫిట్‌నెస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. ఏడేళ్ల తర్వాత ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్ సెంటర్ వెయ్యి కంటే ఎక్కువమంది మహిళలకు సేవలు అందిస్తోంది. కేవలం వ్యాయామమే కాకుండా మహిళ ఆత్మవిశ్వాసానికి ప్రతీకంగా ఈ సెంటర్ నిలుస్తోంది.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే..?

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి కేవలం ఒక్కసారి మాత్రమే KYC పూర్తి చేయాల్సి ఉంటుంది . ఈ ప్రాసెస్‌ను కేవలం రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలతో మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వివరాలు SEBI వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఫిర్యాదుల కోసం పెట్టుబడిదారులు https://scores.gov.in వెబ్‌సైట్లో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కారం సంతృప్తికరంగా లేకుంటే, https://smartodr.in/loginని కూడా సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

HDFC అసెట్ మేనేజ్‌మెంట్

HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో ఒకటిగా ప్రస్తుతం ఉంది. 1999లో దీనిని స్థాపించగా.. SEBI ఆమోదంతో 2000లో కార్యకలాపాలను ప్రారంభించింది. పెట్టుబడిదారులకు ఈక్విటీ, స్థిర ఆదాయం, ఇతర పెట్టుబడి ఎంపికలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా శాఖలు, బ్యాంకులు, స్వతంత్ర ఆర్థిక సలహాదారులు, జాతీయ పంపిణీదారుల ద్వారా సేవలను అందిస్తుంది.