JSW Steel: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు

షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు.. మనం ఉద్యోగానంతరం మంచి రాబడులు ఇస్తాయి. సరిగ్గా దీని తగట్టుగా ఉంది ఈ వార్త కూడా.. ఓ వ్యక్తి 30 ఏళ్ల కిందట రూ. 10 చొప్పున 100 JSW షేర్లు కొన్నాడు. కట్ చేస్తే.. అవి 2025కి ఎంత విలువ చేశాయో తెలుసా

JSW Steel: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు
Telugu News

Updated on: Oct 07, 2025 | 11:48 AM

షేర్ మార్కెట్ అంటేనే చాలామంది భయపడుతుంటారు. ఎంత డబ్బు పెట్టినా.. కచ్చితంగా లాస్ తప్ప ఏం రావు అని అనుకుంటారు. కానీ అది తప్పు అని చెప్పే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందినదే ఇది కూడా. షేర్ మార్కెట్‌లో మనం సరైన పెట్టుబడులు పెడితే.. అవి భారీగా రిటర్న్స్ తెచ్చిపెడతాయని ఇది మరోసారి రుజువు చేసింది. ఓ వ్యక్తి 1995లో JVSLలో రూ. 10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. ఇక అవి ఇప్పుడు ఏకంగా కోట్లు పలుకుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్

ఇవి కూడా చదవండి

ఆ పోస్ట్ ప్రకారం.. ‘అప్పుడప్పుడూ పాత కాగితాలు మనకు కోట్లు తెచ్చిపెడతాయి. ఓ వ్యక్తి 1995లో జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్(JVSL)లో రూ. 10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. ఇక ఈ రోజు వాటి విలువ సుమారు రూ. 1.83 కోట్లు అనమాట. అదెలా అని అనుకుంటున్నారా..!

– 2005లో, JVSL.. JSW స్టీల్‌తో విలీనం అయింది. ఆ సమయంలో JVSLలో 1 షేర్ ఉన్న ప్రతీ వ్యక్తికి 16 JSW షేర్లు లభించాయి. సదరు వ్యక్తికి 100 షేర్లు ఉండటంతో.. అవి కాస్తా.. ఈ లెక్కతో 1600 షేర్లగా మారాయి.

– ఆ తర్వాత JSW 1:10 స్టాక్ స్ప్లిట్ జరగడం వల్ల.. ఆ షేర్లు మరింతగా పెరిగాయి. అంటే.. ఆ 1600 షేర్లు కాస్తా 16,000 JSW స్టీల్ షేర్లుగా మారాయి.

ఇక JSW ప్రస్తుత ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉండగా.. ఆ షేర్ల విలువ ప్రస్తుతం దాదాపు రూ. 1.83 కోట్లుగా ఉంది. ఇది కేవలం అంచనా వేసిన లెక్క మాత్రమే.. డివిడెండ్ కూడా కలిపితే.. ఇంకా ఎక్కువని చెప్పొచ్చు. కాగా, ఈ కాగితాలను ధృవీకరించేందుకు మొదటిగా ఆ వ్యక్తి JSW స్టీల్ బ్రోకర్‌ను సంప్రదించాల్సి ఉండగా.. ఆ తర్వాత ఈ షేర్లను డీమ్యాట్‌ అకౌంట్‌లోకి మార్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు, పాత పెట్టుబడులు జీవితాన్ని మార్చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది