javadekar clarified on petrol rates : పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ వల్ల సామాన్యుడిపై భారం పడదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సెస్‌ను సగటు పౌరుడిపై ఎలాంటి భారం మోపకుండా రూపొందించినట్లు ఆయన చెప్పారు.ఈ మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.” పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఉండదు. ప్రజలపై అదనపు భారం ఉండదు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
There will be no increase in petrol and diesel prices. There will be no additional burden on people .#AatmanirbharBharatKaBudget #Budget2021
— Prakash Javadekar (@PrakashJavdekar) February 1, 2021
ఇదిలావుంటే, కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు సెస్ ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వివరణ ఇచ్చారు. కొత్త సెస్ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.