Parliament: ముగిసిన తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 8 వరకు ఉభయ సభలు వాయిదా..

parliament budget session 2021: పార్లమెంట్ ఈ ఏడాది బ‌డ్జెట్ స‌మావేశాల్లో తొలి ద‌శ ముగిసింది. రాష్ట్రపతికి ధ‌న్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బ‌డ్జెట్‌పై సాధార‌ణ చ‌ర్చ..

Parliament: ముగిసిన తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 8 వరకు ఉభయ సభలు వాయిదా..
Parliament session updates

Updated on: Feb 14, 2021 | 12:42 AM

parliament budget session 2021: పార్లమెంట్ ఈ ఏడాది బ‌డ్జెట్ స‌మావేశాల్లో తొలి ద‌శ ముగిసింది. రాష్ట్రపతికి ధ‌న్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బ‌డ్జెట్‌పై సాధార‌ణ చ‌ర్చ ముగియడంతో ఉభయ సభలను మార్చి 8కి వాయిదా వేశారు. తొలిదశ చర్చ అనంతరం రాజ్యస‌భ‌ను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రకటించారు. మార్చి 8న ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ్యసభలో రెండో విడత బ‌డ్జెట్ స‌మావేశాలు మొద‌ల‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం లోక్‌స‌భ‌లో కూడా బ‌డ్జెట్‌పై చ‌ర్చ ముగియడంతో మార్చి 8న సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

రాజ్యసభ నిన్ననే వాయిదా పడటంతో ఈ రోజు స‌భ 10గంటలకే ప్రారంభమైంది. చ‌ర్చ అనంత‌రం కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆ త‌ర్వాత ప్రభుత్వం జ‌మ్ముక‌శ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు-2021ని స‌భ‌లో ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై సుధీర్ఘ చ‌ర్చ అనంత‌రం లోక్‌స‌భలో ఆమోద‌ముద్ర ప‌డింది. ఈ తొలి విడత సమావేశాల్లో మొత్తం మూడు బిల్లులకు ఆమోద ముద్రవేశారు.

 

Also Read:

India-China Border: భారత్, చైనా మధ్యలో రాహుల్.. ఎడతెగని వాదోపవాదాలు.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?