Budget 2022: గృహ కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు..!

|

Jan 21, 2022 | 9:30 AM

Union Budget 2022: ప్రధాని మోదీ ప్రభుత్వం మరో పది రోజుల్లో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కరోనా ప్రారంభం నాటినుంచి పలు రంగాలన్నీ సంక్షోభంలో

Budget 2022: గృహ కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు..!
Budget 2022
Follow us on

Union Budget 2022: ప్రధాని మోదీ ప్రభుత్వం మరో పది రోజుల్లో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కరోనా ప్రారంభం నాటినుంచి పలు రంగాలన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కరోనా దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ (Budget 2022) రాబోతోంది. దీంతో ఈ బడ్జెట్‌పై పారిశ్రామిక రంగాలతోపాటు, సామాన్యులకు ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈసారి బడ్జెట్‌లో గృహ కొనగోలుదారులకు (home buyers) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుభవార్త చెప్పనున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద గృహ రుణం అసలు చెల్లింపుపై పన్ను మినహాయింపు వార్షిక పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

గృహ కొనుగోలుదారుల కోసం నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేస్తే ఇటు సామాన్య ప్రజలకు ఉపశమనంతో పాటు.. అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద, గృహ కొనుగోలుదారులు గృహ రుణం ప్రధాన చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందుతారు. అయితే 80C కింద మ్యూచువల్ ఫండ్స్ (ELSS), PPF, NSC పన్ను పథకాలతో సహా అనేక ఇతర పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు.

హోమ్ లోన్ ప్రిన్సిపల్‌పై మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం ఈ పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. గృహ రుణాలపై పన్ను రాయితీని పెంచడం వల్ల ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని.. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి ఎక్కువ మంది ప్రజలు ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారని నిపుణులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఈసారి బడ్జెట్ నుండి అనేక ఇతర అంచనాలను కలిగి ఉంది. సరసమైన గృహ రుణాలపై అదనంగా రూ. 1.5 లక్షల మినహాయింపును మార్చి 2023 వరకు పొడిగించే సూచనలు కనిపిస్తున్నట్లు రియల్ ఎస్టెట్ ప్రముఖులు, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఈ తగ్గింపు గడువును రెండుసార్లు పొడిగించింది.

Also Read:

Budget 2022: బడ్జెట్‌ను అత్యధికసార్లు ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా..? ఆసక్తికర విషయాలు..

Goa Elections 2022: హీటెక్కుతున్న గోవా రాజకీయాలు.. ఉత్పల్ పారికర్‌కు దక్కని బీజేపీ టికెట్..