What Got Cheaper and What Got Costlier : కేంద్ర ప్రభుత్వం 2021 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ఆవిష్కరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి నేరుగా లబ్ధి చేకూర్చే అంశాలు పెద్దగా కనిపించలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా, కొత్తగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను విధించింది కేంద్రప్రభుత్వం. ఈ సెస్ ద్వారా కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఈ బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయో ఓసారి చూద్దాం.