New Agri infra cess : బడ్జెట్‌లో పన్ను విధింపుల్లో హెచ్చు తగ్గులు లేకపోయినా.. కొత్తగా సెస్ ద్వారా వసూళ్లు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లాన్ చేసింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. ఆ కొత్త సెస్ పేరు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి నిర్మలా పేర్కొన్నారు. ఈ సెస్‌ను దేశంలోని ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువులైన పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, బంగారం, వెండి, పప్పులు, ఆపిల్స్, పామాయిల్ వంటి వాటిపై విధించనున్నారు.
అయితే, ఈ కొత్త సెస్ ద్వారా ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. తద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఏబీ పాండే వెల్లడించారు. అయితే ఈ సెస్‌ను సగటు పౌరుడిపై ఎలాంటి భారం మోపకుండా రూపొందించినట్లు ఆయన చెప్పారు.
We are expecting Rs 30,000 crores through Agriculture Infrastructure and Development Cess. This cess has been designed such a manner that it won’t impact common man: Finance Secretary AB Pandey pic.twitter.com/As9IgaWLeu
— ANI (@ANI) February 1, 2021
ఇదీ చదవండి….Budget 2021: చదువుకు పట్టం కట్టిన నిర్మలమ్మ.. లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ.. నేషనల్ అప్రెంటిసిషిప్ స్కీం కోసం రూ.3వేల కోట్లు