Budget-2021: బడ్జెట్ 2021: సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలపై ప్రభుత్వం పన్ను రహిత వడ్డీని ఇవ్వాలి

|

Jan 22, 2021 | 3:16 PM

Budget-2021: ఈనెల 29వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ...

Budget-2021: బడ్జెట్ 2021: సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలపై ప్రభుత్వం పన్ను రహిత వడ్డీని ఇవ్వాలి
senior citizens fixed deposit scheme
Follow us on

Budget-2021: ఈనెల 29వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రతిసారి కంటే ఈ ఏడాది బడ్జెట్‌ భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండే బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్‌ 2021లో ప్రభుత్వ సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకాల నుంచి పన్ను రహిత వడ్డీ ఆదాయం పొందాలని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు నివేదికలో సూచిస్తున్నారు.

సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పరిమితిని పెంచాలని తెలిపింది. సీనియర్‌ సీటిజన్ల కోసం ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉందని తెలుస్తోంది. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ కింద ఒక సిటిజన్‌ రూ.15 లక్షల వరకు జమ చేయవచ్చు. ఏదేమైనా సేవింగ్స్‌ పథకాలపై వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే వడ్డీ ఆదాయంపై పన్ను తగ్గింపును అందిస్తున్నట్లు ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది.

సేవింగ్స్‌ పథకాల నుంచి వచ్చే మొత్తం వడ్డీ ఆదాయం రూ.50,000కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్‌ తీసివేయబడుతుంది. అయితే ఫారం 15జి, 15హెచ్‌ సమర్పించిన తర్వాత టీడీఎస్‌ తీసివేయబడదు. 80 టీటీబీ కింద సిటిజన్లు చేసిన డిపాజిట్ల నుంచి రూ.50వేల వరకు వడ్డీ ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు. ఈ పరిమితిని లక్ష రూపాయలకు పెంచవచ్చని నివేదికలో తెలిపింది.

కాగా, ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ పథకాలపై వడ్డీ రేటు 7.4శాతం. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ ఖాతాను తెరుచుకోవచ్చు. కానీ ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. 60 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న సిటిజన్ సేవింగ్‌ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. సిటిజన్‌ సేవింగ్స్‌ పథకం ఐదేళ్ల వ్యవధి పొడిగించవచ్చు.

Also Read: Budget 2021: ‘వాటికి ప్రాధాన్యత ఇస్తేనే దేశం ఆర్థికంగా ముందుకెళుతోంది’.. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల సూచన.

Common Man Budget News 2021: సెక్షన్ 80సి పై ఎన్ని ఆశలో.. సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చేనా?