Petrol Rates : కేంద్ర బడ్జెట్‌లో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ఇక పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త పెట్రోలియం ఉత్పత్తులపై అగ్రిసెస్ వేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో డిజీల్ ధర రూ.4 పెరుగనుంది. అటు పెట్రోల్ ధర రెండున్నర రూపాయలు పెరిగే అవకాశముంది.
బడ్జెట్‌లో దేశ ప్రజలకు దిమ్మ తిరిగే షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోలియం ఉత్పత్తుల మీద అగ్రిసెస్ పేరుతో ధరలు పెంచేసింది కేంద్రం. లీటర్ పెట్రోలు మీద రెండున్నర రూపాయలు, లీటర్ డీజిల్ మీద నాలుగు రూపాయల సెస్సు విధించింది. బంగారం, వెండి మీద కూడా రెండున్నర శాతం సెస్ విధించారు. మద్యం ఉత్పత్తుల మీద వందశాతం సెస్ వేసింది. యాపిల్ రోజువారీ ధరల సమీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. గత పదిరోజుల్లోనే దాదాపు రెండు రూపాయలు పెరిగాయి. ముంబయిలో లీటర్ పెట్రోలు 93 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన సెస్ అమల్లోకి వస్తే.. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడం ఖాయం.
Read Aslo… Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్