మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

విశాఖపట్నం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే వీఎంఆర్డీ మాజీ ఛైర్మన్, ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

Updated on: Oct 04, 2020 | 4:35 PM

విశాఖపట్నం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే వీఎంఆర్డీ మాజీ ఛైర్మన్, ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ… ఆరోగ్యం క్షీణించడంతో నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. హాస్పిటల్ కి వెళ్లిన రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవ౦తి శ్రీనివాస్ ద్రోణ౦రాజు కుమారుడిని, కుటుంభ సభ్యులను పరామర్శించారు.