పెళ్లి కోసం 80 కిలో మీటర్లు నడిచిన యువతి..

|

May 23, 2020 | 4:55 PM

పెళ్లి కోసం ఏకంగా ఓ యువతి 80 కిలోమీటర్లు నడిచింది. ఒంటరిగా సుదీర్ఘ ప్రయాణం చేసి వరుడిని చేరుకుని.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని తిలక్‌ గ్రామానికి చెందిన గోల్డికి కనౌజ్‌కు చెందిన వీరేంద్ర కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. మే 4న పెళ్లి తంతు జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. కానీ, కరోనావైరస్ ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా వారి పెళ్లి కాస్త వాయిదా పడింది. దీంతో దూరంగా ఉంటూనే రోజూ ఫోన్లో మాట్లాడుకున్న […]

పెళ్లి కోసం 80 కిలో మీటర్లు నడిచిన యువతి..
Follow us on

పెళ్లి కోసం ఏకంగా ఓ యువతి 80 కిలోమీటర్లు నడిచింది. ఒంటరిగా సుదీర్ఘ ప్రయాణం చేసి వరుడిని చేరుకుని.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కాన్పూర్‌లోని తిలక్‌ గ్రామానికి చెందిన గోల్డికి కనౌజ్‌కు చెందిన వీరేంద్ర కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. మే 4న పెళ్లి తంతు జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. కానీ, కరోనావైరస్ ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా వారి పెళ్లి కాస్త వాయిదా పడింది. దీంతో దూరంగా ఉంటూనే రోజూ ఫోన్లో మాట్లాడుకున్న వధూవరులు. అనుకున్న తేదీకి పెళ్లి జరుగలేదని నిరుత్సాహపడ్డారు. ఎలాగైనా వీరేంద్రను కలిసి తీరాలని నిశ్చయించుకున్న గోల్డి.. కనౌజ్‌కు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఆమె రాకతో ఆశ్చర్యపోయిన అత్తింటివారు.. విషయం తెలుసుకుని ఓ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఓ సామాజిక కార్యకర్త సమక్షంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పెళ్లి జరిపించారు. మాస్క్ లు ధరించి పెళ్లి దుస్తులతో ఉన్నవారి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు పెళ్లి కూతురు చేసిన ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. కళ్యాణం నిర్ణయం అయ్యాక ఏ లాక్‌డౌన్‌లు ఆపలేకపోయానడానికి చక్కని ఉదాహరణ.