
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఎక్కడో ఓ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంటుంది. తాజాగా శ్రీనగర్‌లోని రణ్‌బీర్‌గర్ ప్రాంతలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారు జామునుంచి ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ ఆర్మీ సెక్టార్ 10 కమాండర్ నరేష్ మిశ్రా తెలిపారు. మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని.. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.