56గంటల ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో 56 గంటల పాటు సాగిన భీకర ఎన్‌కౌంటర్ ముగిసింది. కుప్వారా జిల్లాలో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఐదుగురు భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో మరణించాడు. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు […]

56గంటల ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Edited By:

Updated on: Mar 04, 2019 | 7:16 AM

జమ్ముకశ్మీర్‌లో 56 గంటల పాటు సాగిన భీకర ఎన్‌కౌంటర్ ముగిసింది. కుప్వారా జిల్లాలో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఐదుగురు భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో మరణించాడు. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు సవాలుగా మారింది. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి.