తెలంగాణలో 12 శాతం మందికి కరోనా!

|

Oct 01, 2020 | 5:51 PM

Twelve percent of Telangana population infected by Covid-19: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 శాతం మందికి కరోనా వైరస్ సోకి వుంటుందని అంఛానా వేస్తోంది ఐసీఎంఆర్. రాష్ట్రంలో జరిపిన రెండో విడత సెరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సంయుక్తంగా గురువారం విడుదల చేశాయి. రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత యాంటీ బాడీస్ టెస్టుల ఫలితాలను కూడా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల్లో యాంటీ బాడీస్ గణనీయంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. తెలంగాణలో […]

తెలంగాణలో 12 శాతం మందికి కరోనా!
Follow us on

Twelve percent of Telangana population infected by Covid-19: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 శాతం మందికి కరోనా వైరస్ సోకి వుంటుందని అంఛానా వేస్తోంది ఐసీఎంఆర్. రాష్ట్రంలో జరిపిన రెండో విడత సెరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సంయుక్తంగా గురువారం విడుదల చేశాయి. రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత యాంటీ బాడీస్ టెస్టుల ఫలితాలను కూడా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల్లో యాంటీ బాడీస్ గణనీయంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది.

తెలంగాణలో మొత్తం జనాభా సుమారు 4 కోట్లు కాగా.. అందులో 12 శాతం అంటే సుమారు 48 లక్షల మందికి ఇదివరకే కరోనా వచ్చి వెళ్ళి వుంటుందని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేలో తేలడం విశేషం. కానీ అధికారిక గణాంకాలలో కరోనా సోకిన వారి సంఖ్య కేవలం 1 లక్షా 93 వేలుగా (అక్టోబర్ 1 ఉదయం నాటికి) వుంది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో చాలా మందికి కరోనా వచ్చిన విషయం తెలియకుండా తగ్గి వుంటుందని భావించాలి.

జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో యాంటీ బాడీస్ సెరో సర్వే నిర్వహించారు. మే నెలలో జరిపిన యాంటీ బాడీస్ మొదటి రౌండులో యాంటీబాడీస్ శాతం కేవలం 0.5 కాగా.. తాజాగా సెప్టెంబర్ మూడో, నాలుగు వారాల్లో జరిపిన సెరో సర్వేలో యాంటీ బాడీస్ శాతం 18కి పెరిగినట్లుగా గుర్తించారు. జనగామ జిల్లాలో 454 మందిని పరీక్షించగా 83 పాజిటివ్ (సార్స్ కోవ్ ఎల్జీజీ యాంటీబాడీస్ వున్నాయని, ఇది 18.2 శాతమని సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో 422 మందిని పరీక్షించగా.. 47 మందికి యాంటీబాడీస్ వున్నాయని.. ఇది 11.1 శాతం కాగా.. మే నెలలో ఈ జిల్లాలో 0.25 శాతం మాత్రమే కనిపించాయని రిపోర్టులో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 433 మందిని పరీక్షించగా.. 30 మందికి అంటే 9 శాతం మందిలో యాంటీబాడీస్ వున్నాయని రిపోర్టులో వివరించారు. యాంటీ బాడీస్ పెరిగినప్పటికీ అన్ని వ్యక్తిగత రక్షణ చర్యలు కొనసాగించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరాన్ని విధిగా పాటించడం చేయాలని సలహా ఇస్తోంది ఐసీఎంఆర్.

Also read: పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ

Also read:  హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

Also read: జాతీయ రహదారికి 500 కోట్లు.. కేటీఆర్ డిమాండ్