కుర్చీ ఫర్ సేల్…! టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ప్రత్యేక కథనం

| Edited By:

Apr 26, 2019 | 10:25 PM

అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా? ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుస్తారా? అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి కావలసిన అర్హత ఏంటి? నీతి… నిజాయితీ… ప్రజా సమస్యల పట్ల అవగాహన… ఇవేమి అక్కర్లేదు. డబ్బుంటే చాలు. ఈ డబ్బుతోనే నాయకులు గెలుస్తున్నారు… ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారు. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం 50 కోట్లు కావాలి. ఇది ఒక్క అభ్యర్థి ఖర్చు. ఈ లెక్కన మొత్తం ఖర్చు ఎంతో లెక్కలు వేసుకోవాలి. ఈ ధన ప్రవాహంలో బడాబాబులే ప్రజా ప్రతినిధులైపోతారు. కాంట్రాక్టర్లు… కార్పొరేట్లే […]

కుర్చీ ఫర్ సేల్...! టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ప్రత్యేక కథనం
Follow us on
  • అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా?
  • ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుస్తారా?
  • అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి కావలసిన అర్హత ఏంటి?

నీతి… నిజాయితీ… ప్రజా సమస్యల పట్ల అవగాహన… ఇవేమి అక్కర్లేదు. డబ్బుంటే చాలు. ఈ డబ్బుతోనే నాయకులు గెలుస్తున్నారు… ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారు. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం 50 కోట్లు కావాలి. ఇది ఒక్క అభ్యర్థి ఖర్చు. ఈ లెక్కన మొత్తం ఖర్చు ఎంతో లెక్కలు వేసుకోవాలి. ఈ ధన ప్రవాహంలో బడాబాబులే ప్రజా ప్రతినిధులైపోతారు. కాంట్రాక్టర్లు… కార్పొరేట్లే సీఎం కుర్చీని కొనేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎన్నికల గెలుపు ప్రజాబలానిదా… ధన బలానిదా? ఒక్క నంద్యాల ఉప ఎన్నిక ఖర్చు దాదాపు 150 కోట్లు. వెరసి ఏపీ ఎన్నికల ఖర్చు మొత్తం అక్షరాలా పది వేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి వివరించారు. ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.