బ్రహ్మోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

|

Oct 01, 2020 | 6:04 PM

ఆశ్వయుజ మాసంలో ప్రతీ ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై...

బ్రహ్మోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం
Follow us on

TTD has taken sensational decision on Navaratri Brahmotsavalu: ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఇప్పటి వరకు కొనసాగుతున్న సందిగ్ధం తొలగినట్లయింది. ఈ మేరకు గురువారం నవరాత్రి బ్రహ్మోత్సవాలపై జరిగిన ప్రత్యేక భేటీలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం తిరుమలలో జరిగింది. కరోనా కారణంగా ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికే పరిమితం చేసిన టీటీడీ.. వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలని తీర్మానించింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గతంలో నిర్వహించినట్లుగానే శ్రీవారి వాహన సేవలను తిరుమాడ వీధుల్లో నిర్వహించాలని, వాహనాలను మాడ వీధుల్లో ఊరేగించాలని టీటీడీ నిర్ణయించింది.

బ్రహ్మోత్సవ రోజుల్లో దర్శనాల సంఖ్యను కూడా పెంచే యోచనలో టీటీడీ వున్నట్లు తెలుస్తోంది. దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దర్శనాల సంఖ్యను 20వేల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. మాడవీధుల్లోని గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు ఫుట్ ఆపరేటడ్ శానిటైజర్లు ఏర్పాటు చేయబోతున్నారు. కళ్యాణ వేదిక వద్ద పుష్ప ప్రదర్శన, ఎగ్జిబిషన్ లను కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Also read:  తెలంగాణలో 12 శాతం మందికి కరోనా!

Also read: పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ

Also read:  హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

Also read: జాతీయ రహదారికి 500 కోట్లు.. కేటీఆర్ డిమాండ్