గ్రూప్ 4, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచన : ఈటెల

|

Sep 25, 2020 | 3:17 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్ రేట్ తగ్గిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 80శాతం కరోనా రోగులు కోలుకున్నారని ఆయన చెప్పారు. కరోనాకు చంపగలిగే శక్తి లేదన్న ఆయన.. జాగ్రత అవసరమని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లు సాధారణ స్థితికి త్వరలోనే చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే 4 వ తరగతి, ఔట్ సోర్సింగ్ వారికి జీతాల పెంపు పై కసరత్తు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]

గ్రూప్ 4, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచన : ఈటెల
Follow us on

తెలంగాణలో కరోనా పాజిటివ్ రేట్ తగ్గిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 80శాతం కరోనా రోగులు కోలుకున్నారని ఆయన చెప్పారు. కరోనాకు చంపగలిగే శక్తి లేదన్న ఆయన.. జాగ్రత అవసరమని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లు సాధారణ స్థితికి త్వరలోనే చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే 4 వ తరగతి, ఔట్ సోర్సింగ్ వారికి జీతాల పెంపు పై కసరత్తు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని వేల మందికైనా వైద్యం అందిస్తామని.. ప్రైవేట్ హాస్పిటల్ కి పోయి డబ్బు వృధా చేసుకోవద్దని ఆయన తెలిపారు. కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారని చెప్పిన మంత్రి.. వైద్య విధానం గొప్పగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఆ దిశగా భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.