బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతం నుంచి వీస్తున్న తేమ గాలల మూలంగా.. గత రెండు, మూడు రోజులుగా.. తమిళనాడు, చెన్నైలో.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. ఇప్పుడు ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడిందని.. వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ తేమ గాలల ప్రభావం కారణంగా.. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు సూచించారు. తుఫాను వ్యతిరేక సుడిగాలులు వీస్తున్నందున.. మేఘాలేర్పడి.. వర్షాలు పడనున్నాయని.. అంతేకాకుండా.. చలి తీవ్రత కూడా తగ్గే అవకాశముందన్నారు.