అభినందన్ ఆలస్యానికి అసలు కారణం అదే

|

Mar 02, 2019 | 11:23 AM

న్యూఢిల్లీ: అభినందన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ చాలా సమయం తీసుకుంది. డాక్యుమెంటేషన్ పేరుతో తీవ్రంగా కాలయాపన చేసింది. సాధారంణంగా గంట సమయంలోనే అంతా పూర్తి కావాలి. కానీ పాక్ చాలా గంటలు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ఒక పూటంతా వృధా చేసింది. ఇందుకు ఒక కారణం ఉంది. అభినందన్‌ను భారత్‌కు అప్పగించడానికి ముందు హైడ్రామా నడిచింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు డాక్యుమెంటేషన్ అంటూ వింతగా ప్రవర్తించింది. ఈ ప్రాసెస్‌లో పాక్ ఒక పేజీ వీసాను అభినందన్‌కు […]

అభినందన్ ఆలస్యానికి అసలు కారణం అదే
Follow us on

న్యూఢిల్లీ: అభినందన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ చాలా సమయం తీసుకుంది. డాక్యుమెంటేషన్ పేరుతో తీవ్రంగా కాలయాపన చేసింది. సాధారంణంగా గంట సమయంలోనే అంతా పూర్తి కావాలి. కానీ పాక్ చాలా గంటలు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ఒక పూటంతా వృధా చేసింది. ఇందుకు ఒక కారణం ఉంది.

అభినందన్‌ను భారత్‌కు అప్పగించడానికి ముందు హైడ్రామా నడిచింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు డాక్యుమెంటేషన్ అంటూ వింతగా ప్రవర్తించింది. ఈ ప్రాసెస్‌లో పాక్ ఒక పేజీ వీసాను అభినందన్‌కు అప్పటికప్పుడు జారీ చేసింది. అయింతే అందుకు పలానా కావాలంటూ భారత అధికారులతో తెప్పించుకుంది. ఇంత చేయాల్సిన అవసరం లేనప్పటికీ అసలు కారణం వేరే ఉంది.

అభినందన్‌ను భారత్‌కు అప్పగించడాన్ని పాక్ ఎంతో గొప్పగా భావించింది. తమ శాంతి మంత్రానికి, మంచితనానికి ఇదే నిదర్శనమని చూపే ప్రయత్నం చేసింది. అందుకే అభినందన్‌ను వాఘా బోర్డర్ వద్దకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్‌లో అప్పగించాలని భావించింది. తద్వారా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించాలని ఆలోచన చేసింది. కానీ ఈ కుయుక్తిని ముందుగానే పసిగట్టిన భారత్ బీటింగ్ ద రిట్రీట్‌ను రద్దు చేసింది. దీంతో పాక్ వ్యూహం పని చేయపోవడంతో అక్కసుతోనే ఇలా కాలయాపన చేసి చికాకు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.