ధాయ్‌లాండ్‌లో బస్సును ఢీకొట్టిన రైలు.. 17కి పైగా మ‌ృతులు..29 మందికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 2:40 PM

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. మ‌ృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేంద వెళ్తుండగా ఈ దుర్ఘటన […]

ధాయ్‌లాండ్‌లో బస్సును ఢీకొట్టిన రైలు.. 17కి పైగా మ‌ృతులు..29 మందికి గాయాలు
Follow us on

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. మ‌ృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేంద వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు.

థాయిలాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణ మైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. 2018 మార్చిలో ఈశాన్య థాయిలాండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా 12 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదకరమైన రహదారులు, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, పసలేని చట్టాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి.