విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

| Edited By:

Jul 26, 2020 | 7:52 AM

పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించ‌నున్న కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్-2020 గ‌డువును పెంచింది టీఎస్ ఎస్‌బీటీఈటీ. తెలంగాణ పాలిసెట్‌-2020 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఈ నెల 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్ష‌ణ మండ‌లి..

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..
Follow us on

పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించ‌నున్న కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్-2020 గ‌డువును పెంచింది టీఎస్ ఎస్‌బీటీఈటీ. తెలంగాణ పాలిసెట్‌-2020 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఈ నెల 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్ష‌ణ మండ‌లి శ‌నివారం ప్ర‌క‌టించింది. ముందుగా ప్ర‌కటించిన ప్ర‌కారం ఈ నెల 25తో ద‌ర‌ఖాస్తుల గడువు ముగియ‌డంతో.. రూ.300 ఆల‌స్య రుసుంతో అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేర‌కు ఎస్‌బీటీఈటీ కార్య‌ద‌ర్శి యూవీఎస్ఎన్ మూర్తి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అలాగే డిప్లోమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రం పాలిసెట్‌లో వ‌చ్చిన ర్యాంకుల ఆధారంగా మాత్ర‌మే అడ్మిష‌న్లు జ‌రుపుతామ‌ని ఎప్ప‌టి నుంచో విద్యాశాఖ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ విద్యాల‌యం ప‌రిధిలోని రెండేళ్ల డిప్లోమా, మూడేళ్ల అగ్నిక‌ల్చ‌ర్ డిప్లోమా ఇంజినీరింగ్ కోర్సుల‌కు కూడా ఇక‌పై ప‌దో త‌ర‌గ‌తి మార్కులు లేదా గ్రేడ్లు కాకుండా పాలిసెట్ ర్యాంకును ప్రామాణికంగా తీసుకోనున్నారు.

Read More: క‌రోనాను జ‌యించిన సీనియ‌ర్ నటి, ఎంపీ సుమ‌ల‌త‌..