ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్?

| Edited By:

Mar 11, 2019 | 8:48 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న జరిగే ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 10 స్థానాలపై టీఆర్ఎస్ బాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2014సంవత్సరంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ 11స్థానాలకు గెలుచుకుంది. స్వల్ప తేడాతో 2 స్థానాల్లో ఓటమిపాలయ్యింది. ఇక ఈ సారి మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ మినహా […]

ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్?
Follow us on

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న జరిగే ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 10 స్థానాలపై టీఆర్ఎస్ బాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2014సంవత్సరంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ 11స్థానాలకు గెలుచుకుంది. స్వల్ప తేడాతో 2 స్థానాల్లో ఓటమిపాలయ్యింది.

ఇక ఈ సారి మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలవాలని టీఆర్ఎస్ వ్యూహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువగా సిట్టింగ్‌లకే టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్‌లు భావిస్తున్నారు. దాదాపు 9 స్థానాల్లో సిట్టింగ్‌లకు టికెట్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. వాటిలో కరీంనగర్, వరంగల్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, జహీరాబాద్, భువనగిరి, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. పెద్దపల్లిలో మాజీ ఎంపీ జి.వివేకానంద పేరు దాదాపు ఖాయమైంది. నల్గొండ సిట్టింగ్ ఎంపీకి రాష్ట్రంలో కీలక పదవి ఇచ్చి.. ఈ లోక్‌సభ సెట్మెంట్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.