AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ, కాంగ్రెస్ కు భారీ షాకిచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతేకాదు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని గత రాత్రి ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత […]

నేడు తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2019 | 9:52 AM

Share

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ, కాంగ్రెస్ కు భారీ షాకిచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతేకాదు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని గత రాత్రి ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అందుకోసం తాము చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఎవరుంటారో, ఎవరు పోతారో చెప్పలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించిన ఆయన, ఫిరాయింపు రాజకీయాలను స్వయంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, దానికి ‘అభివృద్ధి కోసం’ అని పేరు పెట్టడం అత్యంత దారుణమైన విషయమని అన్నారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఐదేళ్ల కాలం గడపడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Follow Us