COVID EFFECT కోర్టుల్లో నల్ల కోట్లకు నో.. సుప్రీం ఆర్డర్

|

May 13, 2020 | 8:01 PM

కరోనా వైరస్ ప్రభావం ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్ని రంగాలపైనా చూపుతోంది. తాజాగా కరోనా ప్రభావం కోర్టులను తాకింది. దాదాపు రెండు నెలలుగా కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు కొనసాగుతుండగా.. తాజాగా సుప్రీం కోర్టు మరో సూపర్ ఆర్డర్ జారీ చేసింది.

COVID EFFECT కోర్టుల్లో నల్ల కోట్లకు నో.. సుప్రీం ఆర్డర్
Follow us on

కరోనా వైరస్ ప్రభావం ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్ని రంగాలపైనా చూపుతోంది. తాజాగా కరోనా ప్రభావం కోర్టులను తాకింది. దాదాపు రెండు నెలలుగా కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు కొనసాగుతుండగా.. తాజాగా సుప్రీం కోర్టు మరో సూపర్ ఆర్డర్ జారీ చేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు సెక్రెటేరియట్ నుంచి చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ అయ్యాయి.

కోవిడ్-19 నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాలకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై న్యాయస్థానాలలో కేసులు వాదిస్తున్న న్యాయవాదులు నల్లకోటు ధరించ రాదన్నది బుధవారం జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం.

పురుష న్యాయవాదులు తెల్ల డ్రెస్ అంటే తెల్ల అంగీ (చొక్కా) తెల్ల ప్యాంటు ధరించాలని నిర్దేశించింది. మహిళా న్యాయవాదులు సల్వార్ కమీజ్, వైట్ శారీతో వాదనలు వినిపించాలని ఆదేశాలిచ్చారు. సుప్రీం బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.