AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసొచ్చిన మెయిన్‌పురి నుంచే ములాయం ​​​​​​​పోటీ

లఖ్‌నవూ:ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 15 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను నేడు ప్రకటించింది. పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సారి మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బంధువులైన ధర్మేంద్ర యాదవ్‌, […]

కలిసొచ్చిన మెయిన్‌పురి నుంచే ములాయం ​​​​​​​పోటీ
Ram Naramaneni
|

Updated on: Mar 08, 2019 | 2:32 PM

Share

లఖ్‌నవూ:ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 15 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను నేడు ప్రకటించింది. పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సారి మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఇక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బంధువులైన ధర్మేంద్ర యాదవ్‌, అక్షయ్‌ యాదవ్‌లకు ఈ సారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీలుగా ఉన్న బదౌన్‌(ధర్మేంద్రయాదవ్‌), ఫిరోజాబాద్‌(అక్షయ్‌ యాదవ్‌) తమ యధాస్థానాలనుంచే వీరు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇత్వా నుంచి కమలేశ్‌ కథారియా, రాబర్ట్స్‌గంజ్‌ నుంచి భాయిలాల్‌ కోల్‌, బహ్‌రాయిచ్‌ నుంచి షబ్బీర్‌ వాల్మికి పేర్లు ఖరారయ్యాయి.

మెయిన్‌పురిలో ములాయంకు పట్టు ఎక్కువే. గతంలో 1996, 2004, 2009లో ములాయం ఇక్కడ పోటీచేసి విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజమ్‌గఢ్‌, మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగి రెండు స్థానాల్లో విజయం సాధించారు. మెయిన్‌పురిలో ఏకంగా 3.64లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఫలితాల అనంతరం మెయిన్‌పురి స్థానాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ నేత, ములాయం బంధువైన తేజ్‌ప్రతాప్‌ సింగ్‌ మెయిన్‌పురి నుంచి గెలుపొందారు.

Follow Us
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..