లైంగికదాడి చేసి..ఆపై హత్య!..పోస్టుమార్టం రిపోర్ట్..

చిత్తూరులో చిన్నారి హత్యపై పోలీసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా పోస్ట్‌మార్ట్ రిపోర్ట్ రావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రిపోర్టు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. అటు నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నా.. చిన్నారిని పోగొట్టుకున్న బాధిత కుటుంబం మాత్రం బోరున విలపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలను […]

లైంగికదాడి చేసి..ఆపై హత్య!..పోస్టుమార్టం రిపోర్ట్..

Updated on: Nov 10, 2019 | 5:47 AM

చిత్తూరులో చిన్నారి హత్యపై పోలీసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా పోస్ట్‌మార్ట్ రిపోర్ట్ రావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రిపోర్టు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. అటు నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నా.. చిన్నారిని పోగొట్టుకున్న బాధిత కుటుంబం మాత్రం బోరున విలపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపి వేసిన ఈ ఘటన.. మనుషుల మధ్యే ఉంటున్న మృగాళ్లు.. కొన్ని సమయాల్లో తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని మరోసారి నిరూపితమైంది. పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లిన ఐదేళ్ల చిన్నారి అదృశ్యం అవడం.. కొన్ని గంటల్లోనే.. విగతజీవిగా బయటపడటం.. తల్లిదండ్రులను షాక్‌కు గురి చేసింది. చిత్తూరు జిల్లా కురబలకోటలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి జీవితాన్ని చిదిమేశారు కామాంధుడు. దారుణాతి దారుణంగా 5 ఏళ్ల పసిపాపను రేప్‌ చేసి చంపేశాడు కిరాతకుడు.

తల్లిదండ్రులతో కలిసి కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన వర్షిణి పెళ్లిలో తెగ సందడి చేసింది. కాని అంతలోనే మాయమైంది. చిన్నారి కనిపించకపోవడంతో.. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పరిసరాల్లో గాలించారు కాని.. కనిపించలేదు. చుట్టుపక్కలవారిని అడిగినా.. ఆచూకీ లభించలేదు. ఇంతలో పోలీసులను ఆశ్రయించారు బంధువులు. సీసీటీవీ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. అంతా పెళ్లి హడావుడిలో ఉండగా.. అదనుచూసి కిడ్నాప్‌ చేశాడు ఓ దుర్మార్గుడు. కేఎన్‌ఆర్ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో హత్యచేసి పడేశాడు. పాప కనిపించడం లేదని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టగా శివారులో పాప డెడ్‌బాడీ కనిపించింది.

కాగా పెళ్లి జరుగుతుండగా దుండగుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు అతడిని వాకబు చెయ్యగా..పెళ్లికూతురు తరుఫున, పెండ్లికొడుకు తరఫున అని కొందరికి, పెళ్లి బస్సు సిబ్బందిని అని మరికొందరికి చెప్పినట్టు సమాచారం. హంతకుడు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. చిన్నారి వర్షిణిపై దారుణానికి ఒడిగట్టిన అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు. ఐపిసి 302 సెక్షన్ కింద ముదివేడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు..ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.