ఊహించని విధంగా.. తగ్గి.. షాకిస్తోన్న వెండి ధరలు!!

| Edited By:

Oct 04, 2019 | 10:50 AM

ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి చెందింది. ఇది ఆభరణాలు, నాణేలు, పూజా సామాగ్రి, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా.. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో.. వెండి కూడా బంగారం బాటలో పయనం సాగిస్తోంది. గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉంటోంది. కాగా.. పసిడి ధరతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో.. […]

ఊహించని విధంగా.. తగ్గి.. షాకిస్తోన్న వెండి ధరలు!!
Follow us on

ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి చెందింది. ఇది ఆభరణాలు, నాణేలు, పూజా సామాగ్రి, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా.. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో.. వెండి కూడా బంగారం బాటలో పయనం సాగిస్తోంది.

గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉంటోంది. కాగా.. పసిడి ధరతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో.. 58 వేల బెంజ్ మార్క్‌ని దాటింది. దీంతో.. వెండి వైపు చూడమే మానేశారు ప్రజలు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరింత పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. అనుకోని విధంగా.. శుక్రవారం వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ. . ఏకంగా 2,300 రూపాయలు తగ్గి.. 45,750కి చేరింది వెండి. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా.. వెండి ధరలు తగ్గుతూ ఉంటే.. బంగారం మాత్రం రూ.900లు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల, 10 గ్రాములు రూ. 39,200లకు చేరింది. అలాగే.. 22 క్యారెట్ల .. 10 గ్రాముల బంగారు ఆభరణాల ధర 36,500లుగా మార్కెట్లో పలుకుతోంది.