ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చాలా ప్రదేశాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రాళ్లు, మరికొన్ని చోట్ల వేటకొడవళ్లతో పరస్పర దాడులకు పాల్పడుతున్నారు ఇరు వర్గాలు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారి పాలెంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై చంద్రశేఖర్‌కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు.