‘మహా’ లో ఇంకా తీరని శాఖల ‘ లొల్లి ‘.. జూ.. మంత్రి రాజీనామా

| Edited By: Pardhasaradhi Peri

Jan 04, 2020 | 6:09 PM

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన నేత అబ్దుల్ సత్తార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలముందు కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేన లోకి జంప్ చేసిన ఈయన.. తనకు క్యాబినెట్ హోదా ఇవ్వకుండా దీనికి బదులు సహాయ మంత్రి పదవినిచ్చినందుకు అలక వహించారు. ఔరంగాబాద్ నియోజకవర్గానికి [ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్ సత్తార్ తన రాజీనామాకు కారణం తెలియజేయనప్పటికీ.. ఆయన ‘ అంతరంగం ‘ మాత్రం పార్టీ వర్గాలకు తెలిసింది. అబ్దుల్ రాజీనామా […]

మహా లో ఇంకా తీరని శాఖల  లొల్లి .. జూ.. మంత్రి రాజీనామా
Follow us on

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన నేత అబ్దుల్ సత్తార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలముందు కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేన లోకి జంప్ చేసిన ఈయన.. తనకు క్యాబినెట్ హోదా ఇవ్వకుండా దీనికి బదులు సహాయ మంత్రి పదవినిచ్చినందుకు అలక వహించారు. ఔరంగాబాద్ నియోజకవర్గానికి [ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్ సత్తార్ తన రాజీనామాకు కారణం తెలియజేయనప్పటికీ.. ఆయన ‘ అంతరంగం ‘ మాత్రం పార్టీ వర్గాలకు తెలిసింది. అబ్దుల్ రాజీనామా లేఖ  ఇంకా పార్టీకి అందలేదని సేన నేత ఏక్ నాథ్ షిండే తెలిపారు. కాగా.. మరో సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్.. ఈ జూనియర్ మంత్రి (అబ్దుల్ సత్తార్) విషయాన్ని సీఎం ఉధ్ధవ్ థాక్రే చూసుకుంటారని, అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని అన్నారు. సత్తార్ తో థాక్రే మాట్లాడతారని సంజయ్ చెప్పారు. శాఖల కేటాయింపులో కొంతమందికి అసంతృప్తి కలిగిన మాట నిజమేనని, అయితే ఇది శివసేన కాదని, ‘ మహా వికాస్ అఘాడీ ‘ ప్రభుత్వమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పులో  తాము ఆశించిన శాఖలు దక్కలేదని పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం  గమనార్హం.  పైగా శివసేన, ఎన్సీపీ నేతలు కూడా పైకి చెప్పకపోయినా తమ సన్నిహితుల వద్ద తమ ‘ మనస్తాపాన్ని ‘ బయట పెట్టారు.