డ్రగ్స్ కేసు : ఆస్పత్రిలో సంజనా సిత్రాలు !

డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హీరోయిన్  సంజనా గల్రానీ ఆసుపత్రిలో బ్లడ్  టెస్టుకు  సహకరించలేదని సమాచారం.

డ్రగ్స్ కేసు : ఆస్పత్రిలో సంజనా సిత్రాలు !

Updated on: Sep 11, 2020 | 10:06 PM

డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హీరోయిన్  సంజనా గల్రానీ ఆసుపత్రిలో బ్లడ్  టెస్టుకు  సహకరించలేదని సమాచారం. బెంగళూరులోని కేసీ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆమెకు డోప్ టెస్టులు చేయడానికి డాక్టర్లు ప్రయత్నించగా  అమ్మడు సినిమా స్టంట్లు వేసిందట. మెడికల్ సిబ్బందికి సహకరించకుండా, పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తననెందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని గట్టిగా కేకలు వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రిలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకుంది. డ్రగ్స్ వ్యవహారంలో మొదట కన్నడ నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం సంజనను అరెస్ట్ చేశారు. ఈ కేసును బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం దర్యాప్తు చేస్తోంది.

మరోవైపు ఈ కేసు విచారణలోకి ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ, పృథ్వీ శెట్టితో పాటు డ్రగ్స్ సప్లై చేసే వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ ఆస్తులపై వీరు ఫోకస్ పెట్టారు. వీరికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటమే కాకుండా, కేరళకు చెందిన బంగారు స్మగ్లింగ్‌ ముఠాతో కూడా సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారుకు ఆధారాలు లభించాయి. విచారణ కొనసాగించేందుకు కొచ్చి స్పెషల్ కోర్టు నుంచి అనుమతి కూడా పొందారు. ఇకపై సీబీబీ, ఈడీ అధికారులు ఒకేసారి నిందితుల్ని విచారించనున్నారు.

 

Also Read :

కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కంటైన్మెంట్ జోన్లు

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

 

Loading...
Unable to load recommendations.
Follow Us