కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన, రైస్‌ ఏటీఎమ్‌లు

|

Sep 11, 2020 | 9:37 PM

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చౌకధర దుకాణాల వద్ద రేషన్ కార్డు వినియోగదారుల కష్టాలు తొలగించేందుకు సిద్దమైంది.

కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన, రైస్‌ ఏటీఎమ్‌లు
Follow us on

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చౌకధర దుకాణాల వద్ద రేషన్ కార్డు వినియోగదారుల కష్టాలు తొలగించేందుకు సిద్దమైంది. త్వరలో రైస్ ఏటీఎంలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల  వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితిని నివారించవచ్చునని భావించి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కె. గోపాలయ్య మీడియాకు తెలిపారు.

‘రాష్ట్రంలో రైస్ ఏటీఎంలను ప్రారంభించేందుకు సమాలోచనలు జరుపుతున్నాం. దీని వల్ల   ప్రజలకు రేషన్ షాపులు వద్ద సమస్యలు దూరమవుతాయి. పైలట్ ప్రాజెక్టుగా మొదట రెండు మిషన్లు తెప్పిస్తున్నాం. అవి సత్ఫలితాలు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాం. దీని ద్వారా ప్రజలు ఏ సమంయలోనైనా షాపుల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోవచ్చు. బ్యాంక్ ఏటీఎంలానే కల్పిస్తాం’ అని తెలిపారు.

 

కృష్ణాజిల్లాలో ఘరానా మోసం, ఇంటి పన్ను పేరుతో ముంచేశారు

కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కంటైన్మెంట్ జోన్లు