ఎల్‌జీ పాలిమర్స్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

Remand Extension for Polymers Accused : ఎల్‌జీ పాలిమర్స్‌ కర్మాగారంలో స్టైరిన్‌ గ్యాస్‌ లీకు ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 12 మంది నిందితులు పెట్టుకున్న బెయిన్‌ పిటిషన్‌ను నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి  డిస్మిస్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించాలని కోర్ట్‌ను అభ్యర్థించినట్లుగా ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు 12 మంది నిందితులకు కోర్ట్ రిమాండ్ పొడిగించింది. ఈ కేసును త్వరితగతిన విచారిస్తున్నామని […]

ఎల్‌జీ పాలిమర్స్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

Updated on: Jul 23, 2020 | 8:22 AM

Remand Extension for Polymers Accused : ఎల్‌జీ పాలిమర్స్‌ కర్మాగారంలో స్టైరిన్‌ గ్యాస్‌ లీకు ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 12 మంది నిందితులు పెట్టుకున్న బెయిన్‌ పిటిషన్‌ను నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి  డిస్మిస్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించాలని కోర్ట్‌ను అభ్యర్థించినట్లుగా ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు 12 మంది నిందితులకు కోర్ట్ రిమాండ్ పొడిగించింది.

ఈ కేసును త్వరితగతిన విచారిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 5వందల మందిని ప్రశ్నించామని తెలిపారు. మరికొంతమందిని విచారించాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే సస్పెండైన ముగ్గురు ప్రభుత్వ అధికారుల పాత్రపై ఆ శాఖ నుంచి నివేదిక అందాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఎవరిపాత్ర ఉందని విచారణలో తేలుతుందని స్పష్టం చేశారు.