ఇక పాక్ తో చర్చల సమయం ముగిసిందన్న ప్రధాని మోదీ

|

Feb 18, 2019 | 4:26 PM

పుల్వామా దాడితో పాకిస్థాన్ తో ఇక చర్చలు జరిపే సమయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మార్సితో కలిసి మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ఒక పెద్ద ముప్పుగా మారిందని ఆయన అన్నారు. చర్చలకు సమయం ముగిసిందనడానికి పుల్వామాలో జరిగిన అతి క్రూరమైన ఉగ్రదాడి సంకేతమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. జి20 దేశాల్లో భాగస్వామిగా తాము హంబర్గ్‌ […]

ఇక పాక్ తో  చర్చల సమయం ముగిసిందన్న ప్రధాని మోదీ
Follow us on

పుల్వామా దాడితో పాకిస్థాన్ తో ఇక చర్చలు జరిపే సమయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మార్సితో కలిసి మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ఒక పెద్ద ముప్పుగా మారిందని ఆయన అన్నారు. చర్చలకు సమయం ముగిసిందనడానికి పుల్వామాలో జరిగిన అతి క్రూరమైన ఉగ్రదాడి సంకేతమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. జి20 దేశాల్లో భాగస్వామిగా తాము హంబర్గ్‌ నేతల ప్రకటనలోని 11 పాయింట్ల అజెండాను అమలు పరచాల్సి ఉందని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్‌, అర్జెంటీనాలు సంయుక్తంగా నేడు ఒక డిక్లరేషన్‌ విడుదల చేస్తాయని తెలిపారు.