
గన్నవరం :ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి అవ్వడంతో ఎట్టకేలకు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీని ప్రమోట్ చేసేందుకు విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు వర్మ. కాకపోతే వర్మను పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకోగానే.. ఎయిర్‌పోర్టు వద్దే వర్మను పోలీసులు అడ్డగించారు. తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిందే వర్మపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఇందుకు వర్మ ఒప్పుకోలేదు. తాను విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించి తీరుతానని ఆయన పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, వర్మ ప్రెస్‌మీట్‌తో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ.. ఆయనను తిగిగి వెళ్లాల్సిందిగా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం పోలీసు ఎస్కార్ట్ సాయంతో ఆయనను గన్నవరం ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా వర్మ స్టే చేసేందుకు, ప్రెస్ మీట్ నిర్వహించేందుకు విజయవాడలో హోటల్ యాజమాన్యాలు నిరాకరించడంతో..వర్మ ట్విట్టర్లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.