
పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం వెనుక ఇద్దరు పైలట్ల ముచ్చట్టే కారణమని తేలింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను పాకిస్తాన్ విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ పార్లమెంట్‌కు వివరించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తప్పిదం కూడా ఇందులో కొంత ఉందని అన్నారు. కాక్‌పిట్ డేటా, వాయిస్ రికార్డర్ ద్వారా ఈ విషయాలు తెలిసిందన్నారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఏఐ) కి చెందిన ఏ 320 విమానం మే 22న కరాచీ ఎయిర్‌పోర్టు సమీపంలోని నివాసిత ప్రాంతంలో కూలిన సంగతి తెలిసిందే. 97 మందిని బలిగొన్న ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే ప్రధాన కారణమని మంత్రి ప్రకటించారు.
పైలట్, కో పైలట్ ప్రామాణిక నియమాలను పాటించలేదని అన్నారు. వారిద్దరు కరోనా మహమ్మారి గురించి ముచ్చట్లలో మునిగిపోయారని.. ఆ సమయంలో విమానాన్ని ‘ఆటో పైలట్ మోడ్’లో ఉంచి ల్యాండింగ్‌కు ప్రయత్నించారని అన్నారు. రన్‌వే సమీపిస్తున్నప్పుడు విమానం చాలా ఎత్తులో ఉండగానే ల్యాండింగ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని… మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో విమానం ఇంజన్లు దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగిందని పార్లమెంట్ కు వివరించారు.