‘మహర్షి’ సెట్‌లో మహేశ్.. ఫొటోలు విడుదల

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిలో మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ […]

‘మహర్షి’ సెట్‌లో మహేశ్.. ఫొటోలు విడుదల

Edited By:

Updated on: Mar 09, 2019 | 12:17 PM

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిలో మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నాడు.

ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.